మా తండ్రి గారు ఇటీవల ఆయన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి అందరికి తెలిసిందే, ఆయన పేరు మార్చుకున్నారు గాని, అయన ఆలోచానా విధానం మార్చుకోక పోవటం ఆందోళనగా ఉందని మండిపడ్డారు క్రాంతి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏనాడూ ప్రశ్నించని ఆయనకు పవన్ కల్యాణ్‌ని ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. ఒకసారి, తనపేరును పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాక, కాపుల విషయం, ఉప ముఖ్యమంత్రి వర్యులు, యువత భవిష్యత్ ఆశాజ్యోతి అయిన పవన్ కళ్యాణ్ విషయం ఆయనకు ఎందుకో అర్ధం కావడం లేదన్నారు.. పవన్ కళ్యాణ్ ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది. ఏమి చేయాలో మా తండ్రి గారికే స్పష్టత లేదు అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. శేషజీవితం ఆయన ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవలసిందిగా ఒక కూతురుగా సలహా యిస్తున్నాను.. మళ్లీ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే, నేను గట్టిగా ప్రతిఘటిస్తాను” అని హెచ్చరిస్తూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్‌లో నిలదీశారు ముద్రగడ కూతురు క్రాంతి. కాగా, సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ముద్రగడ వ్యాఖ్యలు చేస్తూ రాగా.. ఆయనకు వ్యతిరేకంగా ఆయన కూతురు క్రాంతి గొంతు విప్పిన విషయం విదితమే.
ముద్రగడపై కూతురు ఘాటు వ్యాఖ్యలు.. పేరు మార్చుకున్నారు.. కానీ..!
