ఆ భవనాలు కూడా కూల్చేస్తాం.. వైసీపీ ఆఫీసులకు నోటీసులు

ysr-cp-29.jpg

ఏపీలో వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ సెంట్రల్‌ ఆఫీస్‌ నిర్మాణాలను కూల్చివేశారు సీఆర్డీఏ అధికారులు. పొక్లెయినర్లు, బుల్డోజర్లతో రెండు గంటల్లోనే నేలమట్టం చేశారు. ఇదే క్రమంలో విశాఖలోని ఎండాడలోనూ వైసీపీకి కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు జీవీఎంసీ అధికారులు. అనుమతి లేకుండా 2 ఎకరాల స్థలంలో ఆఫీసు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇక తాజాగా పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో నిర్మిస్తున్న వైసీపీ జిల్లా కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు అధికారులు. అనధికారికంగా నిర్మిస్తున్నారంటూ ఉండి NRP అగ్రహారంలో వైసీపీ ఆఫీస్‌కు నోటీసు అంటించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరు మీద నోటీసులు జారీ చేశారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన 72 సెంట్ల భూమిలోని నిర్మాణాలు తొలగించి, స్థలాన్ని అప్పగించాలని ఆదేశించారు రెవెన్యూ అధికారులు.

Share this post

scroll to top