కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో నిలిచిపోయిన రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించింది. ఇప్పటికే కొన్ని పనులకు ప్రియార్టీ ప్రకారం సీఆర్‌డీఏ అనుమతి ఇవ్వడంతో శరవేగంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఈ తరుణంలో రాజధాని అమరావతి ప్రాంతానికి మరో శుభవార్త అందింది. రాజధాని నిర్మాణానికి 11 వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు హడ్కో నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం కోసం హడ్కో ద్వారా 11 వేల కోట్ల రూపాయల రుణం కోసం సంప్రదింపులు జరిపాం హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం అవుతాయని వెల్లడించారు. మరోవైపు అమరావతితో పాటు టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదలకు హడ్కో బోర్డు నిర్ణయం తీసుకుంది. 4400 కోట్ల ఋణం కింద టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలని హడ్కో నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
రాజధాని నిర్మాణానికి హడ్కో శుభవార్త..
