కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై వేసిన కేసు నేడు విచారణ..

ktr-30.jpg

మంత్రి కొండా సురేఖపై కేటీఆర్‌ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్‌లను కోర్టు రికార్డ్ చేయనుంది. నిరాధారమైన కొండా సురేఖ ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. గత విచారణలో కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలను కేటీఆర్ కోర్టుకు చదివి వినిపించారు. 23 రకాల ఆధారాలను కోర్టుకు అందించారు.

హీరో నాగార్జున వేసిన పిటిషన్‌పై ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లకు ఈ రోజు కోర్టులో మంత్రి కొండా సురేఖ కౌంటర్ దాఖలు చెయ్యనున్నారు. ఈ కేసులో నాగార్జునతో పాటు సాక్షుల స్టేట్మెంట్‌ ను న్యాయస్థానం రికార్డు చేసింది.

Share this post

scroll to top