ఆర్దిక వనరులు సమకూర్చుకుని సంక్రాంతి నుంచి సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారు. తల్లికి వందనం మినహా మిగిలినవి అమలు చెయ్యాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆలస్యమైందని త్వరగా అమలు చెయ్యకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చేస్తుందని కొందరు మంత్రుల ప్రస్తావించారు. పింఛన్లు మినహా ఏ హామీ అమలు పర్చలేకపోయామని దీన్ని వైసీపీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదముందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబుకు వివిధ జిల్లాల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను బేస్ చేసుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజదాని అమరావతి నిర్మాణానికి నిధులతో పాటు కేంద్ర సాయం కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు. మరోపక్క పోలవరానికి కూడా కేంద్రం నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో సూపర్ సిక్స్ హామీల అమలుపై ఆయన దృష్టి పెట్టారు.