గెలచామన్నా ఆనందం పార్టీ ముఖ్యనేతల్లో కనిపించడంలేదు..

cbnn-22-.jpg

గత ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసి భారీ విజయాన్ని స్వంతం చేసుకున్నాయి. పొత్తుల వల్ల టీడీపీ సినియర్ నేతలు టిక్కెట్ కోల్పోవాల్సి వచ్చింది. చంద్రబాబు రంగంలొకి దిగి వారి అలకలు, బుజ్జగింపులతో కొద్దిరోజులు అధిష్టానం తలలుపట్టుకున్నా క్రమంగా అది తగ్గి అభ్యర్దుల గెలుపుకోసం అసంతృప్తులు పనిచేసేస్థాయికి వచ్చింది. చివరికి అభ్యర్దులు గెలిచారు. ఇంత వరకు బాగానే ఉంది.

చంద్రబాబునాయుడు ఆదేశాలతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా చాలా మంది నేతలు టిక్కెట్లను త్యాగం చేశారు. పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని నేతలు భావించారు. కానీ నామినెటెడ్ పదవుల భర్తీలో సీనియర్లుకు ప్రాధాన్యత దక్కలేదు వారి త్యాగాలను అధిష్టానం గుర్తించలేదని కృష్ణాజిల్లా సీనియర్లు ఆవేదన చెందుతున్నారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలుంటే 13చోట్ల నేరుగా పోటీ చేసి గెలిస్తే రెండు చోట్ల బిజేపీ, ఒక చోట జనసేనపోటీ చేసి గెలిచాయి.

Share this post

scroll to top