విశాఖలో ప్రధాని మోడీ రోడ్‌ షో..

sabaha-08.jpg

సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో జరగనుంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు పాల్గొననున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేసి, వర్చువల్‌గా అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 3 గంటల పాటు ప్రధాని మోడీ విశాఖలో ఉండనున్నారు.

Share this post

scroll to top