నూతన మద్యం పాలసీ..

kolliu-17.jpg

ఆంధ్రప్రదేశ్‌ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. త్వరలోనే నూతన మద్యం పాలసీని ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే వైన్‌ షాపులను నిర్వహించిన విషయం విదితమే.. ఇప్పటికే అదే విధానం కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి కొత్త లిక్కర్‌ పాలసీ తర్వాత మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వ మళ్లీ పాత విధానాన్ని తీసుకొస్తుందా గత ప్రభుత్వాన్ని ఫాలో అవుతుందా అనేది చూడాలి. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధోగతి పాల్జేసిందని మండిపడ్డారు గత పాలకులు సాగించిన ఆరాచకాలను శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు వుంచుతున్నామని తెలిపారు ఇక, త్వరలోనే మద్యం మరియు ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేత పత్రాలను కూడా విడుదల చేయనున్నట్టు వెల్లడిండారు. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు స్వచ్ఛమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా కుటుంభసభ్యులతో తిరుమల శ్రీవారిని ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. గత పాలకులకు కొంత మంది అధికారులు వత్తాసు పలికి అవినీతిలో తమ వంతు పాత్ర పోషించాచారని వారందరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Share this post

scroll to top