బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక తుది అంకానికి చేరింది. నేడో రేపో పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించడానికి పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడి పేరుపై ఇప్పటికే అధినాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, పేరు ప్రకటించడానికి సమయం తీసుకున్నట్టుగా సమాచారం. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఆ పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని అచితూచి ఎంపిక చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు..
