బీసీ రిజర్వేషన్‌ పై ఇక ధర్మయుద్ధమే..

ravanth-02.jpg

బీసీలకు రిజర్వేషన్‌ 42శాతం పెంచుతూ తెలంగాణ తీర్మానం చేసిందని ఆ బిల్లును కేంద్రం ఆమోదించాలని లేదంటే ధర్మయుద్ధం తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ ఢిల్లీ లోని జంతర్‌మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల సాధనకు చేపట్టిన బీసీ సంఘాల ధర్నాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా లెక్క తేలాలన్నారు. అదేవిధంగా రిజర్వేషన్ల అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొచ్చామని అన్నారు. జనాభా లెక్కలు తెలియకపోతే రిజర్వేషన్లు ఇచ్చేందుకు లేదని కోర్టులే చెప్పాయని తెలిపారు. దీంతో జనగణనతో పాటు కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని అన్నారు.

Share this post