టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధితుల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొ్న్నారు. పల్లా శ్రీనివాసుకు శుభాకాంక్షలు పలువురు టీడీపీ సీనియర్ నేతలు తెలిపారు. గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పల్లా సమర్థవంతంగా పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు.. జూన్ 16న పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఈరోజు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాస్..
