ఏపీలో జనసేన పార్టీ నేతలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల ఓ కార్యకర్త వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కారును ట్రాక్టర్‌తో ఢీకొట్టిన ఘటన మరువక ముందే తాజాగా తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్ మీద ఓ మహిళ తనను మోసం చేశాడని ఆరోపణలు చేసింది. ఈ సందర్భంగా బాధితురాలు లక్ష్మి వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా నిలబడతా అన్నావ్ కదా పవన్ కళ్యాణ్ అన్నా ఇప్పుడు మీ జనసేన ఇంఛార్జ్ కారణంగా నాకు కష్టం వచ్చింది నాకు అండగా నిలబడవా అన్న! అమ్మాయిలు, మహిళల జీవితాలతో ఆడుకోవడం తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జి కిరణ్ రాయల్‌కి సరదా ఆ మహిళల వద్ద డబ్బులు అయిపోతే సైలెంట్‌గా జారుకుంటాడు. మొన్న మానస నేడు నేను (లక్ష్మి) రేపు ఇంకో అమ్మాయి. ఇలా ఇంకెంత మంది జీవితాల్ని నాశనం చేస్తావ్ కిరణ్ రాయల్?’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అతనిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరింది.