ప్రభుత్వ స్కూళ్ల‌లో వైయ‌స్ జ‌గ‌న్ చేసిన అభివృద్ధిని చూసి పవన్‌ ఆశ్చర్యం..

pavan-kalyn-05.jpg

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన  హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే.. ఆ మార్పుల్ని చూసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ కంటే ప్రభుత్వ స్కూల్స్‌ బాగున్నాయంటూ పొగిడారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర హైస్కూల్‌ను పవన్‌ కల్యాణ్  సందర్శించారు.  ఈ సందర్భంగా గత వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తరగతి గదుల్లో మార్పు చూసి ఇది ప్రభుత్వ పాఠశాలా? లేక ప్రైవేటు పాఠశాల అంటూ పక్కనే ఉన్న అధికారుల్ని అడిగారు. ఆ తర్వాత విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్‌ని చూసి చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.  

Share this post

scroll to top