ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెన్నైలోని తిరువాన్మియూర్‌లో జరిగిన ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ అనే సెమినార్‌కు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సెమినార్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తిరువల్లువర్, భారతియార్, ఎంజీఆర్ జీవించిన నేల తమిళనాడు తమిళనాడు సిద్ధుల భూమి. తమిళ దేవుడు మురుగన్ భూమి నేను తమిళనాడులో నివసించాను నేను చెన్నైలో పెరిగాను నేను తమిళనాడు వదిలి వెళ్ళిపోయినా, తమిళనాడు నన్ను వదిలి వెళ్ళలేదు అని అన్నారు.
వేర్వేరు ఎన్నికలు నిర్వహించడం వల్ల భారత్ భారీ వ్యయాలను ఎదుర్కొంటోంది. ఎన్నికల కారణంగా, అధికారులు, పోలీసు అధికారులు, ఉపాధ్యాయులు ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావాల్సి వస్తుంది. ఒకే దేశం, ఒకే ఎన్నికతో దేశం ప్రగతి పథంలో ప్రయాణిస్తుంది. ఒక దేశం, ఒక ఎన్నిక ఎన్నికల ఖర్చులను గణనీయంగా తగ్గించగలదని అన్నారు. ఒక దేశం, ఒక ఎన్నిక గురించి చాలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే అంశంపై ప్రతిపక్ష పార్టీలు డబుల్ గేమ్ ఆడుతున్నాయి. కరుణానిధి ఒకే దేశం, ఒకే ఎన్నికల వ్యవస్థను సమర్థించారు. కరుణానిధి జస్టిస్ ఫర్ ది హార్ట్‌లో ఒక దేశం, ఒక ఎన్నికల వ్యవస్థను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కరుణానిధి మద్దతు ఇచ్చిన ఒకే దేశం, ఒకే ఎన్నికల వ్యవస్థను స్టాలిన్ వ్యతిరేకించడం వింతగా ఉంది.