కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మని వారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్..

vijayawada-09.jpg

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా కుమార్తెతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారాయన కాగా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 7వరోజైన నేడు దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉదయం 9 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు.

ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నానికి విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం 2 గంటల సమయంలో ఇంద్రకీలాద్రి చేరుకుని సరస్వతీ స్వరూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోనున్నారు.

Share this post

scroll to top