జనసేనలోకి ముద్రగడ కూతురు..

mudragada-19.jpg

ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముద్రగడ కూతురు తన తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ముద్రగడకు ఆయన కూతురు క్రాంతి భారీ షాక్ ఇచ్చారు. తన తండ్రి చేస్తున్నది కరెక్ట్ కాదని ఆమె స్పష్టం చేశారు. తాను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో నేడు ముద్రగడ కూతురు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జనసేన పార్టీలో చేరనున్నారు. పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆమెకు కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆమెతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు నుంచి పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు.

Share this post

scroll to top