టీడీపీ నాయకులు చేస్తున్న ఒత్తిడితో తమ పింఛన్లు తొలగించి పొట్ట కొట్టవద్దని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అధికారులను వేడుకున్నారు. రాజ కీయ దురుద్దేశంతో వైఎ స్సార్సీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగిం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బాధితుల ధర్నా శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం లోని పలు గ్రామాల్లో స్థానిక అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించారు. మండల వ్యాప్తంగా సుమారు 730 మందికి నోటీసులిచ్చారు. మూడు రోజుల్లోపు సరైన ఆధారాలు చూపకపోతే పింఛన్ల జాబితా నుంచి మీ పేర్లు శాశ్వతంగా తీసివే స్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో మండలంలోని వేపకుంట గ్రామానికి చెందిన పలువురు పింఛన్దారులు బుధవారం కనగానపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఎంపీడీఓ అలివేలమ్మకు వినతిపత్రం అందజేసి తమ గోడు వెలిబుచ్చారు. అనంతరం పింఛన్దారులు తిమ్మారెడ్డి, తిప్పన్న, రుక్మిణమ్మ, రామ లింగ, ఫక్రూబీ తదితరులు విలేకర్లతో మాట్లాడారు. తామంతా వైఎస్సార్సీపీ సానుభూతిపరులమన్న ఉద్దేశంతో గ్రామంలోని 62 మందికి అధికారులు నోటీసులు ఇచ్చి.. పింఛన్లు తొలగిస్తామని చెబుతున్నారన్నారు.
టీడీపీ నాయకుల ఒత్తిడితో పింఛన్లు తొలగింపు..
