తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘తెలుగు న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోంది!’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అంశాలపై ఈ రోజు.. ప్రజాభవన్ వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయిలో కీలక సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైన నేపథ్యంలో మరోసారి విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు సిద్ధమయ్యారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. పేర్ని నాని ఆసక్తికర ట్వీట్
