ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల తొలగింపు ప్రక్రియ అధికారులకు ఛాలెంజ్‌గా మారింది. 5 గంటల పాటు అష్టకష్టాలు పడ్డా బోట్లు అర అంగుళం కూడా కదల్లేదు. అవి కదలమంటే కదలమని మొరాయిస్తున్నాయి. ప్లాన్ A ఫెయిల్ అవడంతో ఇవాళ ప్లాన్ Bని సిద్ధం చేశారు అధికారులు. ప్రకాశం బ్యారేజీలో చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు సాధ్యపడలేదు. భారీ క్రేన్లు వినియోగించినా గేట్లకు అడ్డంగా పడిన భారీ పడవలు ఇంచు కూడా కదల్లేదు. దాదాపు 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లతో కలిపి లేపినా ఆ బోట్లు కదల్లేదు. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండడం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండడం, ఒక బోటు కింద మరో బోటు ఉండడం వాటి నిండా ఇసుక ఉండడంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదు.
ఛాలెంజ్ గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ..
