బీఆర్‌ఎస్‌ కు షాక్‌.. కాంగ్రెస్‌ లోకి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి..

POCHARAM-21.jpg

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌లో సీనియర్‌ నేతగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డితో కాంగ్రెస్ లోకి చేరడంతో బీఆర్ఎస్ కు పెద్ద షాక్‌ తగిలింది. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్​ ఎంపీ బలరాం నాయక్​, కాంగ్రెస్​ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. అలాగే పోచారంను సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పోచారం ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి.. సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు. సహకరించాలని కోరామని తెలిపారు. పెద్దలుగా సహకరించాలని కోరామని తెలిపారు. దీంతో పోచారం స్పందించి హస్తం గూటికి చేరారు.

Share this post

scroll to top