హెచ్‌సీయూలో తీవ్ర ఉద్రిక్త‌త‌..

hyd-02-1.jpg

రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై హెచ్‌సీయూ విద్యార్థులు పోరుబాట కొన‌సాగిస్తూనే ఉన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడాలంటూ నిర‌స‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇక బుధ‌వారం ఉద‌య‌మే హెచ్‌సీయూ క్యాంప‌స్‌ను వేలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. క్యాంపస్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యూనివ‌ర్సిటీ లోప‌లికి బ‌య‌టి వ్యక్తుల‌ను రానివ్వ‌కుండా, విద్యార్థుల‌ను బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బుధ‌వారం ఉద‌యం హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న ప్రొఫెస‌ర్లు, విద్యార్థుల‌పై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. దొరికిన విద్యార్థుల‌ను దొరికిన‌ట్లు లాఠీల‌తో చిత‌క‌బాదారు. పోలీసుల తీరుపై ప్రొఫెస‌ర్లు విద్యార్థులు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నిన‌దిస్తూ, పోలీస్ జులుం న‌శించాల‌ని నినాదాలు చేశారు. దీంతో హెచ్‌సీయూ క్యాంప‌స్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

Share this post

scroll to top