బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

jani-19.jpg

గత మూడు రోజులుగా అజ్ఞాతనంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‏ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్‌ SOT పోలీసులు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదారాబాద్ కు తీసుకువస్తున్నట్లు సమాచారం. జానీ మాస్టర్ కేసులో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. అతని పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు మైనర్ గా ఉన్నప్పటి నుంచే జానీ వేధింపులకు పాల్పడ్డాడని తెలియడంతో పోక్సో కేసు పెట్టారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న జానీ ప్రస్తుతం లడఖ్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి జానీ కోసం వేట మొదలు పెట్టారు.

Share this post

scroll to top