ప్రభాస్ హను మూవీ లేటెస్ట్ అప్డేట్..

prabas-23-.jpg

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి కురుస్తున్నాయి. కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాదు అభిమానులు, ఇతర హీరోల అభిమానుల సైతం ఆయన మీద పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రభాస్ సినిమాలు అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. నిజానికి అధికారికంగా ప్రకటన రాకపోయినా ప్రభాస్ అభిమానుల కోసం ఆఫ్ ది రికార్డ్ లీక్స్ బయటకు వస్తున్నాయి ముఖ్యంగా ప్రభాస్ హను రాఘవపూడి సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తెరమీదకి వచ్చింది. అది ఏమిటి అంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గత నెల తమిళనాడులో చేసినట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఒక స్పెషల్ షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ షూటింగ్ ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ఈ షూటింగ్ కోసం ఇప్పటికే భారీ సెట్లను సిద్ధం చేస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రభాస్ కి సంబంధించి ఒక ఫోటో షూట్ కూడా ఇదే సెట్లో చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు సిద్ధమైంది.

Share this post

scroll to top