విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
