సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ SSMB 29 దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టాలని చూస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ఈ సినిమా పాన్ గ్లోబల్ గా ఉంటుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్ ఈ సినిమాలో నయా లుక్ లో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది ఇప్పటికే అల్యూమినియం ఫ్యాక్టరీలో వర్క్ షాప్ నడుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమా షూటింగ్ కెన్యా అడవుల్లో కూడా చేయనున్నారని సమాచారం. అలాగే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా రాజమౌళి, ప్రియాంక చోప్రా, కీరవాణి కలిసి దిగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోతో ప్రియాంక హీరోయిన్ గా చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే ఈ ఫోటో ఆర్ఆర్ఆర్ సినిమా యూస్ లో స్క్రీనింగ్ చేసిన సమయంలోది అని తెలుస్తుంది. కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రాజమౌళి. మొదటి భాగం 2027లో విడుదల చేసి, రెండో భాగాన్ని 2029లో విడుదల చేస్తారని టాక్ వినిపిస్తుంది. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది.