మీరే మారతారా.. నన్ను మార్చేయమంటారా? అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..!

varadharajulu-27.jpg

కడప జిల్లాలోని ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అధికారులకు తనదైన శైలిలో హెచ్చరికలు జారీ చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతిపై అధికారులందరూ లెక్క చెప్పాల్సిందేనని అన్నారు. ప్రజా సమస్యల కోసం కాకుండా ప్రజా ప్రతినిధుల కోసం పని చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ వరద గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంట. గత నాలుగు రోజుల క్రితం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో వరదరాజుల రెడ్డి పాల్గొని ప్రతి ఒక్క అధికారులు పేరుపేరునా పిలుస్తూ గత ఐదేళ్లు చేసిన అవినీతి చాలని ఇప్పుడు జరగబోయే పాలనంత పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జరగాలన్నారు. ప్రజాప్రతినిధుల కోసం పనిచేయడం పక్కన పెట్టాలని, ప్రజల కోసం మాత్రమే పనిచేయాలని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే ఎక్కడికైనా బదిలీ చేయించుకుని వెళ్లిపోండీ, ఇక్కడైతే ఉండొద్దని, ఇకపై నిత్యం ప్రజల కోసమే పని చేయాలన్నారు. గత ఐదేళ్లలో ఏమేమి జరిగాయో మొత్తం అంతా కొద్ది రోజులలో రెడీ చేసి ఫైల్స్ అందజేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.

Share this post

scroll to top