గత కొద్దిరోజుల నుంచి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఏకంగా బీఫ్ ఫ్యాట్ ఆయిల్స్, పంది కొవ్వు కలిసిందంటున్నారు పలువురు రాజకీయ నాయకులు. రీసెంట్‌గా ఫ్రూప్స్ కూడా చూపించారు. ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూను అపవిత్రం చేసి మనోభావాలు దెబ్బతినేలా చేశారు అంటూ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అయితే కేవలం జంతువుల కొవ్వు అపవిత్రమైనదే కాదు. హెల్త్‌కు కూడా మంచిది కాదని తాజాగా కార్డియాలజిస్టులు.
జంతువుల కొవ్వు తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ కొవ్వులో సంతృప్త కొవ్వులు, ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోని కొలెస్ట్రాల్ లెవల్స్‌ను భారీగా పెంచి.. ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. గుండె అండ్ ఇతర ఆర్గాన్స్‌లో అడ్డంకులు ఏర్పడేలా చేస్తుంది. అలాగే కాలేయ పనితీరు దెబ్బతింటుంది. రెడ్ మీట్‌లో కూడా సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తింటే మాత్రం దీర్ఘకాలం అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్ ప్రాబ్లమ్స్, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.