వయనాడ్‌లో ప్రభావిత ప్రాంతాల్లో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. ఇప్పటి వరకూ ఈ విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయట పడుతున్నాయి. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే గుండె బరువెక్కుతోందని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట కాలంలో వయనాడ్ ప్రజలకు నేను, ప్రియాంక అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. సహాయక చర్యల్ని దగ్గరుండి పరిశీలిస్తున్నట్టు చెప్పారు రాహుల్. బాధితులందరికీ పునరావాసం కల్పించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నట్టు వివరించారు. యూడీఎఫ్ కూటమి తరపున అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించారు. తరచూ ఇలాంటి విపత్తులు తలెత్తడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఈ ముప్పు నుంచి తప్పించుకోడానికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
వయనాడ్‌లో పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం..
