రాహుల్ గాంధీ దయచేసి ఇది చెప్పండి..

brs-10.jpg

రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఉన్న ఫోటోలను ప్రింట్ చేసిన టీషర్టును ధరించి అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేటీఆర్‌ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సైతం ఉన్నారు. తాజాగా దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అదానీ-మోడీ కలిసి ఉన్న ఫోటోలు ప్రింట్ ఉన్న టీషర్టుతో రాహుల్ గాంధీ పార్లమెంటుకు వెళితే తప్పులేదు కానీ నేను అసెంబ్లీకి వెళ్లితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఈ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.‘రాహుల్ గాంధీ గారు ఇది ఎలాంటి వంచన? మీ అడుగు జాడల్లో నడిచి అదానీ రేవంత్ అఫైర్‌ను బయటపెడదామనుకున్నాం. కానీ మమ్మల్ని రానివ్వలేదు. దీనికి మీరు సమాధానం చెప్పాలని’ కేటీఆర్ రాసుకొచ్చారు.

Share this post

scroll to top