అమరావతి పునర్నిర్మాణం..

cbn-19.jpg

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆ పనులను ప్రారంభించనున్నారు చంద్రబాబు. రూ.160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను చేపట్టింది సీఆర్డీఏ. ఆ తరువాత ఆ పనులు నిలిచిపోయాయి. ఈనెల 16న జరిగిన సీఆర్ఢీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభం పై నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నేడు పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాలు అప్పటికే పూర్తయిన భవనాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం తెలిసిందే మరోవైపు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయాన్ని కూడా ప్రకటించింది. 

Share this post

scroll to top