అవినీతి, డిజిటలైజేషన్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది. దీనికి ఆల్టర్నేట్ చూపించకపోవడంతో భూ పరిపాలన వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయింది. అంతేకాకుండా ప్రభుత్వ భూముల పరిరక్షణ, సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలన, వివిధ ధ్రువపత్రాల విచారణకు కూడా ఉద్యోగి లేని పరిస్థితి ఏర్పడింది. అధికార కేంద్రీకరణ జరిగి ప్రతి సమస్య పరిష్కారానికీ జిల్లా కేంద్రం, హైదరాబాద్ కు వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. దీంతో గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక దాని కోసం కసరత్తు ముమ్మరం చేసింది.
వెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఫోకస్..
