ఏపీలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరును వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా ఎండగట్టారు. కూటమి పాలనలో ఒక్కొక్క దానికి చరమగీతం పాడేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసిన కూటమి ప్రభుత్వం, భరోసా కేంద్రాలకు కూడా ఎత్తేస్తుందని, ఇప్పుడు ఇక బడుల వంతు అంటూ మాజీ మంత్రి రోజా విమర్శించారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు. ఇప్పుడు బడుల వంతు. అయినా విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ముందే మీరు చెప్పారు లెండి తప్పు మీది కాదు తప్పంతా లదే, ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా, బాగుందాయ్యా బాగుంది అని ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది అని రోజా ఎద్దేవా చేశారు.
తప్పుమీది కాదు తప్పు ఈవీఎంలదే..
