జగన్‌ సీఎంగా ఉంటే మహిళల జోలికి రావాలంటే మగాళ్లు భయపడేవాళ్ళు రోజా..

rk-roja-31.jpg

జగన్‌ సీఎంగా ఉంటే మహిళల జోలికి రావాలంటే మగాళ్లు భయపడేవాళ్ళు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ మంత్రి రోజా. ఇవాళ తిరుమలలో ఏపీ మాజీ మంత్రి రోజా మీడియాతో ముచ్చటించారు. ఏపీలో మహిళల రక్షణ పరిస్థితి చాలా దారుణంగా వుందన్నారు మాజీ మంత్రి రోజా. ఉచ్చమర్రిలో బాలికను చంపి 60 రోజులైనా ఆచూకి లభించలేదని ఆగ్రహించారు ఏపీ మాజీ మంత్రి రోజా. జగన్ ప్రభుత్వంలో తప్పు చెయ్యాలంటే భయపడేవాళ్ళని చెప్పారు. 2014 నుంచి 19 వరకు పార్టిని ఫిరాయించిన వారి పరిస్థితి ఎంటో ఆలోచించుకోవాలని చురకలు అంటించారు ఏపీ మాజీ మంత్రి రోజా. ఇక మొన్న కూడా రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికలు ఒక సునామీ లాగా జరిగిపోయిందని తెలిపారు రోజా. ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదన్నారు. ఇంత ఘోరంగా ఓడిపోయే తప్పులను వైసీపీ పార్టీ గాని ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని చేయలేదని వివరించారు రోజా.

Share this post

scroll to top