మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. అదేవిధంగా సజ్జల, ఆర్కే ముందస్తు బెయిల్ పిటిషన్లపై ధర్మాసనం విచారించింది. ఇవాళ్టి వరకు వీరిద్దరినీ నిందితులుగా చేర్చలేదని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. నిందితులుగా చేరిస్తే 5 రోజుల ముందే సమాచారం ఇస్తామని పేర్కొంది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈరోజు వరకు సజ్జల, ఆర్కేను నిందితులుగా చేర్చేలేదని న్యాయస్థానానికి ప్రభుత్వం వివరించింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఆగస్టు 2కు వాయిదా వేసింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసుపై హైకోర్టులో విచారణ..
