దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుంది. కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు తరగతి గదుల్లో చదువుకు నోచుకోని పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు 43 పాఠశాలలు అదీ గిరిజనులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక మూతపడటమంటే పాలకులు సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజనులు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరం. మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఉన్న స్కూల్లో మూత వేయడానికా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మూతపడ్డ 43 ప్రభుత్వ పాఠశాలలను వెంటనే తెరిపించాలని, టీచర్ల నియామకం జరిగేవరకు విద్యా వాలంటీర్లను నియమించాలని విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉపాధ్యాయులు లేరన్న కారణంతో రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా చూడాలని, వెంటనే ముఖ్యమంత్రి స్థాయిలో విద్యాశాఖ పై సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతున్నాను.
టీచర్లు లేక మూతపడుతున్న పాఠశాలలు..
