ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీ నుంచి సంచలన ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలో కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయింది. సినిమా వాళ్లలో ఎవరైనా ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారా? అని ప్రశ్నించారు. సినిమా రంగ అభివృద్ధికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులా? అని మండిపడ్డారు. చిత్రసీమలో కొందరి రిటర్న్ గిఫ్ట్‌కి థ్యాంక్స్ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు ఉండబోవు అని సంచలన ప్రకటన చేశారు. సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాల్సి ఉంటుందని కండీషన్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సినిమా వాళ్లకు ప్రభుత్వమే ముందుకొచ్చి మరీ సాయం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చాలా కృషి చేసింది. అలాంటిది అందరూ కలిసి రావాలన్నా పట్టించుకోరా? అని మండిపడ్డారు.
ఇక నుంచి సినిమా వాళ్లతో ప్రభుత్వం వ్యక్తిగత చర్చలు ఉండబోవు..
