రాష్ట్రంలో కొత్త కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చి దాదాపు 4 వేల కోట్ల మేర కుంభకోణానికి పాల్పడిన వ్యవహారంలో మిథున్ రెడ్డితో పాటు అప్పటి బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, మరికొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. మిథున్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఈ మేరకు ఎంపీ మిథున్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మిథున్ రెడ్డిని సీఐడీ అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయింది.