టాలీవుడ్ సినిమాలలో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లా పేరు ఏదైనా వాటికి స్పెషల్ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటి స్టార్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ సినిమాలలో సైతం ఐటం సాంగ్స్ ఉండాల్సిందే. అయితే ఈ సాంగ్స్ కొరియోగ్రఫిలో హద్దులు దాటకుండా చూసుకుంటారు సదరు దర్శకులు. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాను రాను ఈ సాంగ్స్ లో భావం పక్కకి వెళ్లి, భూతు అగ్ర తాంబూలం అందుకుంటుంది.
ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్న సాంగ్స్ కొరియోగ్రఫి బూతుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటోంది. మిస్టర్ బచ్చన్ లో సాంగ్ శృతిమించింది అనుకుంటే మొన్న వచ్చిన డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ భారీ ట్రోలింగ్ కు గురైంది. హీరోయిన్ పిరుదుల మీద బాదడం ఏంటని నెటిజన్స్ శేఖర్ ను దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలోని “అదిదా సర్ప్రైజు పాటలో కేతిక శర్మ స్టెప్పులు చూస్తే శేఖర్ లోని బూతు పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా కేతిక శర్మ కాస్ట్యూమ్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి. కేతిక శర్మ యద అందాలను మొత్తం మల్లెపూలతో కప్పి ఆమెతో శేఖర్ వేయించిన స్టెప్పులు అతి జుగుప్సాకరంగా ఉన్నాయి. సినిమా చూసేందుకు ఫ్యామిలి ఆడియెన్స్ వస్తారు అనేది మరిచిపోయి రికార్డింగ్ డాన్స్ లా పాటను కంపోజ్ చేసాడు శేఖర్. ఒకప్పుడు గీత దాటకుండా ఐటం సాంగ్స్ ను తన అద్భుతమైన కంపోజింగ్ ఆడియెన్స్ ను అలరించిన శేఖర్ ఇప్పుడు తనలోని డాన్స్ మాస్టర్ కు దుప్పటి కప్పి పడుకోబెట్టి బూతు స్టెప్స్ తో హీరోయిన్స్ ని బంతిలాగా ఆడుకుంటున్నాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.