శ్రీశైలంలో రోడ్డు విస్తరణ చేస్తుండగా అద్భుతం.. తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శివ లింగం, శిలాశాసనం!

srisilam-05.jpg

జాతుల, భాషల చరిత్రకి నమ్మకమైన భౌతిక ఆక్షరాల్లో శాసనాలు ముఖ్యమైనవి. శిలా శాసనాల్లో కనిపించే విషయాలను మనవాళ్లు ప్రామాణిక సత్యాలుగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే తాజాగా జ్యోతిర్లింగం శక్తిపీఠం కొలువైన శ్రీశైల మహా క్షేత్రంలో 14వ శతాబ్దం నాటి శిలాశాసనం, అతి పురాతన శివలింగం బయటపడ్డాయి. దీంతో శివ భక్తులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని యాంఫి థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. యాంఫి థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా సీసీ రోడ్డు, సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జేసీబీ సాయంతో తవ్వకాలు జరుపుతుండగా, శివలింగం బయటపడింది. పరిసరాలను చదును చేస్తుండగా పురాతన ఓ శివలింగం వెలుగులోకి వచ్చింది. శివలింగంతోపాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది. శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Share this post

scroll to top