పేర్లతో కనిపించే వెండి రాఖీలు..

raki-14.jpg

అన్నా చెల్లిలా అనుబంధానికి నిలువెత్తు నిదర్శనంగా ఏడాదికి ఒకసారి వచ్చే పండుగ రాఖీ పౌర్ణమి పండుగ అని చెప్పుకోవచ్చు. శ్రావణమాసంలో నిండు పౌర్ణమి రోజు శుభ ఘడియల్లో ఆ ఇంట్లో ఉన్న గృహిణి వారి అన్నదమ్ములకు చేతికి వారినిదీవిస్తూ ఒక పసుపు తాడు కట్టిందా వారు ఆ ఏడాదంతా సుఖసంతోషాలతో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారని పురాణా ఇతిహాసాలు చెబుతున్నాయి. నాడు కట్టే పసుపు తాడే నేడు రాఖీలుగా అనేక రకాల మోడల్స్ లో వీక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం ఆ జిల్లాలో వెండితో ముఖ్యంగా పేర్లతో తయారు చేయించే రాఖీలు మరి ముఖ్యంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి.

రాఖీ పౌర్ణమి పండుగ వస్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు రకరకాల రాఖీలు అందుబాటులో ఉంచారు. అయితే ఈ ఏడాది కాకినాడ తుని బెల్లపు వీధి ప్రాంతాలలో రాఖీ దుకాణదారులు మీరు కట్టబోయే వారి పేరు చెబితే చాలు వారిపేరుతో వెండి రాఖీ రెండు గంటల కాలంలో సిద్ధం చేస్తామంటూ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

Share this post

scroll to top