ఇంటూరి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన వైయ‌స్ జ‌గ‌న్‌..

ys-jagannnn-12.jpg

సోష‌ల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి ర‌వికిర‌ణ్ కుటుంబ స‌భ్యుల‌ను వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ భార్య ఇంటూరి సుజన క‌లిశారు. పోలీసులు త‌న భ‌ర్త‌ను వేధించార‌ని, బలవంతంగా సంతకం చేయించార‌ని సుజ‌న వైయ‌స్ జ‌గ‌న్‌కు తెలిపారు.  పోలీసుల తీరు అసలు బాగోలేదు. నా భర్తపై  తప్పుడు కేసులు పెట్టి గతనెల 21 నుంచి స్టేషన్ల చుట్టూ తిప్పుకున్నార‌ని ఆమె పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యుల‌కు వైయ‌స్ జ‌గ‌న్ ధైర్యం చెప్పి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా క‌ల్పించారు.

Share this post

scroll to top