నాలుగు గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తివేశారు..

srisilam-29.jpg

నదీపరివాహకంగా ఎగువన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పోటెత్తింది. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా, ఆదివారం సాయంత్రానికే 873.40అగులకు చేరుకుంది. నీటి నిలువ కూడా 156.39టిఎంసీలకు చేరింది. ఎగువనుంచి రోజుకు 40టిఎంసీలకు పైగా వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరుకుంటోంది. మరో 59టిఎంసీల నీరు చేరితే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోనుంది. అయితే నీటిమట్ట 800అడుగులకు చేరుకోగానే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి ఎగువ నుంచి వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తారు అనిఅధికారులు వెల్లడించారు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తారు.. సోమవారం గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేసి.. సాయంత్రం నీటిని వదిలారు.. ఇప్పటికే.. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నాలుగు గేట్లను దాదాపు 12 అడుగుల మేర ఎత్తివేశారు..

Share this post

scroll to top