SLBC సమావేశంలో కీలక నిర్ణయం.. రూ.5,40,000 కోట్లతో రుణ ప్రణాళిక..

cbn-09-1.jpg

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం ముగిసింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలన్న ఏపీ సీఎం. పి 4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టాలన్నారు. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించిన ఆయన.. స్కిల్ డెవలప్‌మెంట్‌ చర్యలకు బ్యాంకర్ల సాయం ఉండాలన్నారు..

Share this post

scroll to top