పేర్ని నాని, విడదల రజినీ ఇండ్లపై రాళ్ల దాడి !

rajini-anksghc.jpg

ఎన్నికల కౌంటింగ్ వేళ మచిలీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిపై ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు రాళ్ల దాడి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీఛార్జ్ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు ఏపీ మాజీ మంత్రి విడదల రజినీ ఇంటిపైన కూడా రాళ్ల తో దాడి చేశారు. ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. అయితే.. ఇదంతా తెలుగు దేశం పార్టీ తమ్ముళ్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ఈ సంఘటనలపైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Share this post

scroll to top