ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దుబ్బాకలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుకు సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ఏడు నెలల్లో తెలంగాణలో పల్లెలన్ని మురికి కూపాలుగా మారాయన్నారు. గ్రామ పంచాయితీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాలన గాలికొదిలేసి ప్రతిపక్షాల మీద కుట్రలు చేసి ప్రతికారం తీర్చుకోవడానికి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని ట్విటర్ వేదికగా ఖండించారు. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.? అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి అని మండిపడ్డారు. ఇలాంటి బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఎన్నికలు రాక తప్పదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకుండా ఉండదు..
