టీడీపీ, జనసేన అరాచకం.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ భర్తపై దాడి

ysrcp-03-1.jpg

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ భర్తపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో దాడిని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కాగా, పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్‌లోని వైఎస్సార్‌సీపీ జెండా దిమ్మను టీడీపీ, జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దిమ్మను ఎందుకు పగులగొట్టారని వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ మైలవరపు రత్నకుమారి, ఆమె భర్త దుర్గారావు ప్రశ్నించారు. దీంతో, పచ్చ బ్యాచ్‌ మరింత రెచ్చిపోయారు. అనంతరం, దుర్గారావుపై దాడి చేశారు. టీడీపీ, జనసేన కార్యకర్తల దాడిలో దుర్గారావు తీవ్రంగా గాయపడటంతో ఆయనను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, దుర్గారావుపై దాడిని ఖండిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దాడిని ఖండించారు. ఈ నిరసనల్లో విజయవాడ పశ్చిమ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ షేక్‌ ఆసిఫ్‌, పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Share this post

scroll to top