ఏపీలో తాలిబన్ల తరహా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆగడం లేదు. హత్యలు, ఆస్తుల విధ్వంసాలు నిత్యం కొనసాగుతున్నాయి. ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలుపై ప్రజాస్వామ్యవాదుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి మాజీ సీఎం, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లపైనా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు హెచ్చరించినా పోలీసులు పట్టించుకోవడం లేదు. కూటమి ప్రభుత్వ ఉన్మాదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి నెలదాటినా రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల అరాచకాలకు అంతులేకుండాపోతోంది. పచ్చమూకల దాడులతో రాష్ట్రం అట్టుడుకుతున్నా ప్రభుత్వ పెద్దలకు, పోలీసులకు పట్టడంలేదు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు కూడా స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నా ఆయనలో చలనంలేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పుంగనూరు, కుప్పంలో టీడీపీ శ్రేణులు ఏం చేసినా చూసీచూడనట్లు వ్యవహరించాలని మౌఖిక ఆదేశాలిచ్చారంటూ పోలీసు వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతుండడం ఇక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.
పచ్చ’ అరాచకాలు.. ఏపీలో తాలిబన్ల తరహా పాలన
