తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇకపై తెలంగాణ గడ్డపై కూడా ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. అమరావతి వేదికగా జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. తెలంగాణలో ఇప్పటికీ పదిశాతానికి పైగా ఓటు బ్యాంక్ టీడీపీకి ఉండటంతో పార్టీని యాక్టీవ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోనూ టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని తీర్మానించారు. ఒకవేళ టీడీపీ అధినేత తెలంగాణపై ఫోకస్ పెడితే ఎక్కడి నుంచి రంగంలోకి దిగుతారనేది సస్పెన్స్‌గా మారింది. గ్రామస్థాయిలో టీడీపీకి చెందిన కేడర్ అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్‌వైపు మళ్లడంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు పార్టీని యాక్టివేట్ చేయాలని చూస్తున్నారు. దీంతో ఇతర పార్టీల్లో చేరిన వాళ్లంతా తిరిగి సొంత గూటికి వస్తే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గ్రామస్థాయిలో పార్టీ కేడర్ అంతా చీలిపోవడంతో మున్సిపల్, జెడ్పీ ఎన్నికల్లో పోటీ పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనలోనూ టీడీపీ బాస్ ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇకపై తెలంగాణ గడ్డపై కూడా ఫోకస్..
