టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..

mla-17.jpg

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ కు చేదు అనుభవం ఎదురైంది. ఓర్వకల్లులో పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టుకు సీఎం చంద్రబాబు వెళ్లారు. అయితే చంద్రబాబును కలిసేందుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు రాజశేఖర్‌కు ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించారు. కానీ ఆయన అనుచరులకు మాత్రం ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్లనివ్వలేదు. అనుమతి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బందిపై బుడ్డా రాజశేఖర్ అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Share this post

scroll to top