డీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు..

budha-29.jpg

టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధ వెంకన్న తాజాగా కొన్ని హాట్ కామెంట్ చేసారు. ఇందులో భాగంగా పదవి జ్వరం లాంటిది వస్తుంది.. పోతుంది…, టీడీపీలో నా అంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరని ఆయన పేర్కొన్నాడు. నాని ఎంపి నామినేషన్ విత్ డ్రా అయ్యాక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకిగా మాట్లాడాడు. మేము నానికి వ్యతిరేకులం.. పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదన్న బాధ చంద్రబాబు సీఎం అయ్యాక పోయిందని వ్యాఖ్యానించాడు. ఎంపీ కేశినేని చిన్ని కి కుటుంబ విలువలు చాలా ఎక్కువని తెలుపుతూ.. కేశినేని చిన్ని మా టీం టీడీపీ అధ్యక్షుడుగా ఉండాలని ఆయన పేర్కొన్నాడు. చిన్ని చేసిన ప్రజాసేవ కార్యక్రమాలు నేను వద్దన్నా చేసాడని., ఇకపోతే ఎవరైనా విజయవాడలో రెండుసార్లు మాత్రమే ఎంపీగా గెలుస్తారని అంటూనే.. కేశినేని చిన్ని మూడోసారి ఎంపీగా ప్రమాణం చేసే వరకూ కలిసే ఉంటా అని బుద్ధ వెంకన్న మాట్లాడారు.

Share this post

scroll to top